సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆగస్టు 15 న ఒకే రోజు పాన్ ఇండియా స్థాయిలో 3 సినిమాలు విడుదలయి మంచి ఓపెనింగ్స్ సాధించాయి. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు సారధ్యంలో సీనియర్ హీరో రజనీకాంత్‌ స్టలిష్ విలన్ గా నాగార్జున కాంబేషన్ ఉపేంద్ర, అమిర్ ఖాన్ లు గెస్ట్ లుగా విడుదలయిన ‘కూలి ‘సినిమా 15 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా 270 కోట్లు వసూళ్లు సాధించగా మరియు హిందీలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఫై జూ ఎన్టీఆర్, హుట్రిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా 15 రోజులకు 250 కోట్లు అధిగమించింది. ఈ రెండు సినిమాలకు డివైడ్ టాక్ లు రాగ .. 15 రోజులకే కలెక్షన్స్ స్పీడ్ బాగా పడిపోయింది. అయితే ఎటువంటి హడావిడి లేకుండా( హరిహర వీరమల్లు సినిమాతో పాటు) 5వారాల క్రితం బొమ్మల సినిమాగా వచ్చిన అవతార్ నరసింహ సినిమా వీటిని అధిగమించి పాన్ ఇండియా స్థాయిలో 300 కోట్లు పైగా వసూళ్లు సాధించి అందరిని నివ్వెర పరచింది. ఇక భీమవరంలో అయితే కూలి సినిమా టౌన్ మొత్తం మీద 50 లక్షలు వసూళ్లు సాధించగా వార్ 2 టౌన్ మొత్తం మీద 42 లక్షల పైగా మరియు అవతార్ నరసింహ సుమారుగా 40 లక్షలు వసూళ్లు సాధించి ఇంకా స్ట్రాంగ్ గా ఉండటం విశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *