సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజు సారధ్యంలో సీనియర్ హీరో రజనీకాంత్ స్టలిష్ విలన్ గా నాగార్జున కాంబేషన్ ఉపేంద్ర, అమిర్ ఖాన్ లు గెస్ట్ లుగా విడుదలయిన కూలి సినిమా టాక్ తో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ దుమ్ము దులుపుతుంది. నేడు, ఆదివారం తో 4 రోజులు పూర్తీ చేసుకొంటున్న కూలి సినిమా కుఫస్ట్ డే నుంచే తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. మొదటి రోజు(Coolie Collections) తెలుగు మార్కెట్లో రూ.20 కోట్లు, రెండవ రోజు(Coolie Day 2 Collections) రూ.14 కోట్లు కలెక్షన్లతో కూలీ ఫుల్ జోష్లో ఉంది.3వ రోజు 6 కోట్లు నేడు, ఆదివారం 9 కోట్లు పైగా కలెక్షన్.. మొత్తంగా 4 రోజులకు తెలుగులోనే సుమారుగా 50 కోట్ల కలెక్షన్ రాబట్టే అవకాశం మెండుగా ఉంది. ఇక తమిళ్ హిందీ తెలుగు వెర్షన్ లు కలపి మొత్తంగా 200 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో మొదటి 4 రోజులకు సుమారు 3న్నర కోట్ల కలెక్షన్ సాధించే దిశగా దూసుకొని పోతుంది. భీమవరం పట్టణంలో అయితే మొదటి రోజు 26 ఆటలు 2వ రోజు 19 ఆటలు 3వ రోజు 15 ఆటలు ప్రదర్శించగా.. నేడు సుమారు 17 ఆటలు ప్రదర్శించే అవకాశం ఉంది. రేపు సోమవారం నుండి సినిమా అసలు సత్తా తెలుస్తుంది. ఇక జూ ఎన్టీఆర్, హుట్రిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా కూడా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకొనిపోతుంది. ఈ సినిమా హిందీలో దుమ్ము దులుపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజులకు 158 కోట్ల కలెక్షన్ నమోదు చేసింది. ఇక నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేటితో 4 రోజులకు సుమారు 2 కోట్ల 40 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అవకాశాలు ఉన్నాయి. భీమవరం లో మొదటి రోజు 19 ఆటలు 2వ రోజు 12 ఆటలు 3వ రోజు 8 ఆటలు ప్రదర్శించగా నేడు 4వ రోజు 10 ఆటలు పదర్శించే అవకాశం ఉంది.
