సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ యువీ కృష్ణంరాజు జయంతి సందర్బంగా భీమవరం డిఎన్నార్ కళాశాల వద్ద యుకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ను ఈనెల 20వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహిస్తున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, స్థానిక మాజీ ఎంపీ రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి తెలిపారు. నేడు, శనివారం డీఎన్ ఆర్ కలశాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. గతంలో కృష్ణంరాజు గారు ఇక్కడ ఎంపీ గా ఉన్నపుడు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించేవారని.. ఇప్పుడు ఆయన ఆశయాలు కొనసాగింపుగా మరోసారి ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు డయాబెటిక్ పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రఖ్యాత వైద్యులు వస్తున్నారని, వారికీ పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా అందిస్తామని కావున జిల్లా వ్యాప్తంగా అందరూ సద్వినియోగము చేసుకోవాలని కోరారు.
