సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన వాహనంలో నేడు, మంగళవారం భారీ పేలుడు జరిగింది. గత దీపావళి పండుగ సందర్భంగా సీజ్ చేసిన బాణాసంచా వేరే ప్రాంతానికి తరలిస్తుండగా పోలీసు వాహనంలో టపాసులు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎస్సై దుర్గ వీరాంజనేయులు తో సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
