సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్ని కల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం బస్సు’ యాత్ర 19వ రోజు అనకాపల్లి జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా నేడు, శనివారం (ఏప్రిల్20) చింతపాలెం వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేసి తాను ఒక్కడినే ఎన్నికలకు వస్తుంటే 75 ఏళ్ల వయసులో పది మందిని పోగేసుకుని ఎందుకు వస్తున్నావని చం ద్రబాబును ప్రశ్నించారు. ఒక్కే ఒక్కడిని ఎదుర్కొనేందుకు నక్కలన్నీ కలిసి వస్తున్నాయన్నారు. ఇటీవల చంద్రబాబు తనను బచ్చా అని సంబోధిస్తున్నారని.. మరి తాను బచ్చా అయితే తన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యే లను గెలిపించుకున్న నిన్ను ఏమనాలని చంద్రబాబును ప్రశ్నించారు. మరో మూడు వారాల్లో జరగబోతున్న ఈ ఎన్నికలు ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా గుర్తుండిపోతాయి. మన ఈ సిద్ధం సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయి.ఉక్రోశం, కడుపు మంటతో చంద్రబాబు తన మీద రాళ్లు వేయమంటున్నా డు. . కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, పూతన రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు లాంటి వాళ్లు కు పట్టిన గతే ఎల్లో బ్యాచ్ కి పడుతుంది అన్నారు సీఎం జగన్..
