సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణ జిల్లాలో నేడు, మంగళవారం మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. విజయవాడ ఆటోనగర్ వద్ద నుండి బయలు దేరిన జగన్‌కు గ్రామగ్రామాన మహిళలు బూడిద కాయలతో దిష్టి తియ్యడం , వేలాది వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలకడం జరుగుతుంది. పెనమలూరు పామర్రు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగన్ ఆయా గ్రామాల రైతులను పరామర్శకు కు రోడ్డు షో మాదిరి కారు బయట నిలబడి ప్రజలకు పార్టీ క్యాడర్ కు రైతులకు అభివాదాలతో (ఇటీవల వైజాగ్ నుండి నర్సీపట్నం 60 కిమీ రోడ్డు షో దారిపొడవునా జనంతో జాతీయ మీడియాలో సైతం మంచి కిక్ ఇచ్చిన నేపథ్యంలో..మరల అదే తీరిన ) ముందుకు కదులుతున్నారు. పోలీసులు ప్రజలను అదుపు చెయ్యలేక ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వేలాదిగా తరలివస్తున్న వారిని హైవే మీదకు రాకుండా రోప్ ల ద్వారా పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలోనే గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైవే మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దంటూ మీకు ఇలా మోహరించడానికి అనుమతులు లేవని వైసీపీ అభిమానులకు పమిడిముక్కల సీఐ చిట్టిబాబు చెప్పడం వారు ఒక్కసారిగా దూసుకొని పోవడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు తావిచ్చింది. తుపాను ప్రభావంతో తమ పొలాలలో పంట నష్టపోయామని పలువురు రైతులు వరి కంకులను , అరటి చెట్లను తీసుకోని వచ్చి జగన్ కు తమ కష్టాలు వివరించడం జరిగింది.. వారికి నష్టపరిహారం అందేలా వైసీపీ పోరాడుతుందని భరోసా ఇస్తూ పంట పొలాలు పరిశీలిస్తూ జగన్ పర్యటన ముందుకు కదులుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *