సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ జిల్లా ఈడుపుగల్లు (Eedupugallu)లో ఐఐటీ విద్యార్థులు వారి తల్లి తండ్రులు నేడు, శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఇక్కడి ప్రముఖ ఐఐటీ మెడికల్ అకాడమీ (IIT Medical Academy) మూసివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో 600 మంది మొదటి సంవత్సరం విద్యార్థుల పరిస్థితి త్రిశంకు సర్గంగా మారింది. అయితే అకాడమీ యాజమాన్యం మాత్రం ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మరో ఐఐటీ క్యాంపస్‌లోకి తీసుకుంటామని చెప్పడం దానికి విద్యార్థులు, వారి తల్లితండ్రులు ససేమిరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఈడుపుగల్లు ఐఐటీ మెడికల్ అకాడమీలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నిజానికి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీలు మూడు మాత్రమే. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు, కర్నూలు జిల్లా చిన్నటేకూరు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడు ప్రాంతాల్లో ఇవి నడుస్తున్నాయి. వీటిలో ఈడుపుగల్లు అకాడమీ ప్రత్యేకించి బాలికలకు 2017 లో ఏర్పాటు చెయ్యడం ఇప్పుడు మూసివేయడం దారుణం అని దీనిపై ప్రభుత్వం ఫై న్యాయ పోరాటానికి సిద్ధం అని విద్యార్థుల తల్లితండ్రులు ప్రకటించారు.
