సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో నేటి, సోమవారం తెల్లవారు జాము జరిగిన 2రోడ్డు ప్రమాదాలలో చెరో 4 చప్పున 8 మంది చనిపోవడం విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ సీఐ అల్లు లక్ష్మీ నరసింహమూర్తి, వీరవల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కారు కొవ్వూరు నుంచి తమిళనాడు కారులో వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది అని, మృతులు తమిళనాడు వారేనని పోలీసులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన సత్య అనే మహిళను వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్సు లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే తిరుపతి జిల్లాలో ఈ తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కొంగరివారిపల్లి దగ్గర ఓ కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు నెల్లూరు జిల్లాకు చెందినవారు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు,
