సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాలా కాలానికి విభిన్న దర్శకుడు కృష్ణ వంశీ.. రంగమార్తాండ.. సినిమాతో ఈ ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు,, మరాఠీ లో నానా పాటేకర్ హీరోగా బాగా విజయం సాధించిన ‘నటసామ్రాట్’ అనే సినిమాని తెలుగు ‘రంగమార్తాండ’ గా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఈ సినిమా 3 ఏళ్ళ క్రితమే పూర్తి అయి చాలా కాలం అవుతున్నా, విడుదలకి నోచుకోలేదు.. రంగమార్తాండ సినిమా మెగాస్టార్ చిరంజీవి మాటలతో మొదలెట్టాడు. మరల టైటిల్స్ పడుతున్నప్పుడు కూడా చిరంజీవి నటుడి గురించి చెపుతున్న భావోద్వేగ మాటలు హృదయాన్ని హత్తుకొని సినిమా జ్ణాపకాలు ప్రేక్షకుడిని వెంటాడేలా చేసాయి.కధ విషయానికి వస్తే,, .. రాఘవరావు (ప్రకాష్ రాజ్) రంగస్థల దిగ్గజాలవంటి నటుల్లో ఒక నటుడు. ఒకవిధంగా అతని జీవితంలో చాలా భాగం రంగస్థలమే అయింది. రంగస్థల నటుడిగా అతని ప్రతిభకి మెచ్చి ‘రంగమర్తాండ’ బిరుదు ప్రదానం చేస్తారు. అదే సత్కార సభలో రాఘవరావు తాను ఇక నటించనని, భార్య, బిడ్డలా కోసం మిగతా కాలాన్ని వినియోగిస్తానని ప్రకటిస్తాడు. ఇంటికి వచ్చి తన ఆస్తిని పిల్లల పేర్ల మీద రాస్త్తూ, ఇష్టపడి కట్టుకున్న ఇంటిని కోడలు గీతా రంగారావు (అనసూయ) పేరు మీద రాస్తాడు. కూతురు శ్రీ (శివాత్మికా రాజశేఖర్)కు తన బ్యాంకులో డిపాజిట్ల రూపం లో వున్న డబ్బు ఇస్తాడు.అలాగే ఆమె ప్రేమించిన అబ్బాయి రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్) కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. భార్య పేరుమీద కానీ, తన పేరు మీద కానీ ఏమీ వుంచుకోడు. భార్యకి తాను వున్నానని చెప్తాడు. ఇలా అన్నీ ఇచ్చేసి తన శేషజీవితాన్ని తన స్నేహితుడు చక్రవర్తి (బ్రహ్మానందం), భార్య (రమ్యకృష్ణ) తో సంతోషంగా గడుపుదామని నిశ్చయించుకుంటాడు. స్నేహితుడు, భార్య వారిస్తున్నా అన్నీ పంచేస్తాడు. కానీ రాఘవరావు అనుకొన్నది ఒకటి అయితే, జరిగేది మరొకటి.. చివరకి ఏమైంది తెలియాలంటే ‘రంగమార్తాండ’ సినిమా చూడాల్సిందే.. మన కళ్ళముందు నాటక కళాకారులు జీవితాలు , ప్రస్తుత కుటుంబ వ్యవ్యస్థలు లో వస్తున్నా మార్పులు అన్నిసన్నివేశాలలో సజీవంగా కనపడతాయి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం వారి పాత్రలలో అద్భుతం గా జీవించారు, ఒక్క మాటలో చెప్పాలంటే .. కృష్ణ వంశీ ఒక అద్భుతమైన తెలుగు సినిమా తీసాడు,ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం చాల సహజము గా మితంగా ఉంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *