సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్ సభ ఎన్నికలవేళ, తెలంగాణాలో ఒక ప్రక్క బిఆర్ ఏస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి వలస వెళ్లిపోవడంతో మరో ప్రక్క ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాములో అరెస్ట్ అయ్యి తీహార్ జైలు కు వెళ్లిపోవడంతో దిగాలు పడిన మాజీ సీఎం, కల్వకుంట్ల చంద్రశేఖర్ కుటుంబంలో తాజగా నేడు, మంగళవారం మరొకరు అరెస్ట్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్న రావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భూఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్ కన్నారావు సింగపూర్ పరారైనట్టు కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే పోలిసుల అదుపులో ఉన్న ఆయనను మరికాసేపట్లో ఆయనను పోలీసులు రిమాండ్ చేయనున్నారు. హై కోర్టులో కన్నారావు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం కన్నా రావు ప్రయత్నం చేశాడు. మనేగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు కన్నారావు అండ్ గ్యాంగ్ యత్నించింది. కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యారు. కన్నారావు కోసం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కన్నారావుపై147, 148, 447, 427, 307, 436, 506, r/w149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
