సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో వరుసగా ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్‌కల్యాణ్ పాల్గొంటున్నారు.. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచార సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. తనకు సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వీహెచ్ హనుమంతరావు బాగా తెలుసన్నారు. కానీ రాజకీయం వేరు, స్నేహం వేరని అన్నారు. నిజానికి.. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తన కుటుంబ సభ్యులు, అన్న చిరంజీవి కూడా కొన్ని అంశాలలో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే బంధాలు, రాజకీయాలు వేర్వేరని అన్నారు. నాకు ఎవరితో స్నేహం ఉన్నా మోదీ నాయకత్వాన్నే తాను బలపరుస్తానని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణాలో 2014 నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణలో అభివృద్ధిలో మార్పేమీ లేదన్నారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే భూముల ధరలు పెరిగాయని గత పాలకులు చేసిన తప్పులే తెలంగాణలో మరలా పునరావృతం అవుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో విద్య వ్యవస్థ నిర్వహణ బాగోలేదని ,పేపర్ లీకేజీలతో నిరుద్యో గ యువత ప్రాణాలు కోల్పో యారని విమర్శించారు. బీజేపీ అభ్య ర్థులకు జనసేన శ్రేణులు మద్దతు ఇవ్వా లని ఆయన కోరారు. ఈనెల 27న గ్రేటర్ హైదేరాబద్ లో నిర్వహించే బీజేపీ ర్యాలీలో ప్రధాని మోడీ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం..
