సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అటు కేంద్రం ఇటు రాష్ట్రం లోని బీజేపీ ఫై ఒక రేంజ్ లో పోరు సలుపుతూ.. ఇటీవల టీఆరెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలతో ప్రముఖ స్వామిజి తో సహ ముగ్గురిని అరెస్ట్ చేసి కెసిఆర్ ప్రభుత్వం చూపిన దూకుడుతో కేంద్రం లో అమిత్ షా ఆధ్వర్యంలో హోమ్ శాఖ కెసిఆర్ తీరు ఫై ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కెసిఆర్ మరింత అలర్ట్ అయ్యారు. ఇకపై సీబీఐ దర్యా ప్తునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. కానీ తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ తన దర్యాప్తులను నిర్వహించలేదు. గతంలో ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు, బీజేపీ తో పొత్తు రద్దు చేసుకొని కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూ ఇదే తీరు వ్యవహరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *