సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసిపి రాజసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో చర్చలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకొనే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందులో కేంద్రం , న్యాయవ్య వస్థల జోక్యం తగదన్నారు.‘ అయితే న్యాయవ్యవస్థ లో కొందరు పిటిషన్లు వెయ్యడం వల్ల దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు దక్కకుండా పోయాయి. రాజధాని విషయం ఇప్పు డు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. ఆర్టికల్ 154 రెడ్ విత్ నిర్ణయించింది. అన్నారు. ( ఇదే సమయంలో న్యాయవ్య వస్థపై మీ వ్యాఖ్యలను సమర్థించుకొనే డాక్యుమెంట్ను సభ ముందు ఉంచండి అని విజయసాయి రెడ్డి ని రాజ్యసభ ఛైర్మన్ ఆదేశించారు.) 2020 ఫిబ్రవరి 4న హోం మంత్రి లోక్ సభ లో ఇచ్చి న ఓ సమాధానం లోనూ రాష్ట్ర భూభాగంలో రాజధానిని ఎంచుకొనే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని చెప్పారు. అయినా కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఫై ఎందుకు వివక్ష చూపుతున్నారు, ఏపీకిఅన్యాయం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఏపీకి ప్రత్యే కహోదా ఇవ్వ కపోవడం బీజేపీ కాంగ్రెస్ పార్టీల సంయుక్త వైఫల్యం . ఈ రెండు పార్టీలూ అన్యాయం గా విభజన చేసి ఆం ధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేశాయి. అందుకే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 1%, బీజేపీ కి 5% ఓట్లు వచ్చాయి. ప్రత్యేక హోదాను పక్కన పెట్టడానికి మేం అనుమతించం. అది ముగిసిన చరిత్ర అని బీజేపీ చెబుతోంది గానీ, ప్రత్యేక హోదాను చరిత్రలో కలిసిపోవడానికి మేం అంగీకరించం ’’అన్నారు. విశాఖ మెట్రోరైలుకు నిధులు ఇవ్వకుండా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమను
ప్రదర్శిస్తోందని విజయసాయిరెడ్డి విమర్శించారు.‘విభజన చట్టం 13వషెడ్యూ లులోని 12వ పాయింట్ కింద విశాఖ మెట్రోతో పాటు, విజయవాడ-గుం టూరు-తెనాలి గురించీ చెప్పారు. కానీ ఆచరణ ఏది? తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.
