సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీకి వెళ్లి ప్రధాన మం త్రి మోడీతో తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి, నిర్మల సీతారామన్ తో, నీతి ఆయోగ్ అధికారులను సీఎం జగన్ కలిసినప్పుడల్లా గత 9 ఏళ్లుగా కేంద్రం రాష్ట్రానికి చట్ట ప్రకారం ఇవ్వవలసిన రెవెన్యూ లోటు భర్తీ గురించి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రస్తావిస్తూ వచ్చా రు. ఆ చర్చలు నేటికీ ఫలించి జగన్ సర్కర్ విజయం సాధించింది. తాజగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏపీ కి చెల్లించవలసిన రెవెన్యూ లోటు భర్తీ కింద ప్రత్యేక సాధారణ ఆర్థికసాయం గా రూ.10,461 కోట్లు మంజూరు చెయ్యడం పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.16,078 కోట్లుగా కాగ్ గతంలోనే తేల్చింది. దీనిపై కేంద్రం అపట్లో పెద్దగా స్వాదించలేదు. దీనిపై గత చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు విడుదల చెయ్యాలని కోరిననప్ప టికీ కేంద్రం విడతల వారీగా కేవలం రూ.4,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. అయితే ముఖ్య మంత్రి జగన్ గత 4 ఏళ్లుగా పేదల సంక్షేమానికి… తరుచు ‘బటన్’ నొక్కుతూ నిధుల కొరతతో అలసిపోతున్న వేళ .. ఉద్యోగుల జీతాలు కూడా సమయానికి చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న వేళ్ళ కేంద్రం లోని మోడీ సర్కార్ తాజాగా విడుదల చేసిన రూ.10,460.87 కోట్ల నిధులు విడుదల చెయ్యడం సీఎం జగన్ కు పెద్ద ఊరటనిచ్చే అంశంగానే పరిగణించాలి. FLASH: నేడు, బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో పర్యటిస్తున్న సీఎం జగన్ విద్య దీవెన క్రింద జనవరి-మార్చి త్రైమాసికానికి 703 కోట్లు నిధులు బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి విడుదల చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *