సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల ఏపీ అప్పులు 10 లక్షల కోట్లు చేరిపోతున్నాయని జోరుగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్‌ లో 2023 బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఏపీ అప్పులు రూ. 4,42,442 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తాజగా ప్రకటించింది.. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో అప్పులకు తోడు కార్పొరేషన్లు, ఇతర మార్గాల్లో అప్పులు అదనంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. కేంద్రం చెప్పిన వివరాలు ప్రకారం పరిశీలిస్తే ..మాజీ సీఎం చంద్రబాబు హయాంలోనే 2109 వరకు కేంద్రం నుండి రాష్ట్రము తీసుకొన్న రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండటం గమనార్హం. తరువాత 2019 ను సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక .. 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లు వరకు పెరిగింది. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ధారణ మేరకే అప్పులు ఉన్నాయని , ఆంధ్ర ప్రదేశ్ ప్రతి ఏడాది సుమారు రూ.45 వేల కోట్ల అప్పులు చేస్తోంది’’ అని పంకజ్ చౌదరి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *