సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని 500 నోట్ల వినియోగం గురించి ప్రజలను, అలర్ట్ చేస్తూ తాజగా సంచలన హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది.ఇటీవల సరికొత్త టెక్నాలజీ వినియోగించి రూ.500 దొంగ నోట్లు చెలామణిలోకి వచ్చినట్లు, అవి ఏ స్థాయిలో చెలామణిలో ఉన్నాయో ఇంకా తెలియడం లేదని ప్రజలు, వ్యాపారస్తులు, బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈ దొంగ నోట్లు దాదాపుగా అచ్చుగుద్దినట్లు అసలు నోట్లను పోలి ఉన్నాయని వీటిని వెంటనే గుర్తించడం కష్టంగా ఉన్నాయని స్పష్టం చేసింది. కాబ్బటి పరిస్థితి చుస్తే త్వరలో కొత్త డిజైన్ తో 500 నోట్లను కేంద్రం వినియోగంలోకి? తెచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. అసలే 2027 చివరలో జమిలి ఎన్నికలు అంటున్నారు.
