సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నేడు, శుక్రవారం వరుసగా కేంద్ర మంత్రులల్తో రాష్ట్రానికి రావలసిన నిధులు కేటాయింపులు , ఇతర పెండింగ్ పనులు విషయం ఫై చర్చిస్తూ భేటీలతో బిజీగా ఉన్నారు. నేడు ఉదయం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కలిశారు. బాబుతో పాటు కేంద్ర మంత్రి, నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ,కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ,శ్రీకృష్ణ దేవరాయలు, పెమ్మసాని, ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, చీఫ్ సెక్రటరీ నీరాబ్ కుమార్ ప్రసాద్, ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్.. కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను చంద్రబాబు కలిశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం 11:30 గంటలకు కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు భేటీ అవనున్నారు. నేటి సాయంత్రం విజయవాడ కు తిరుగు ప్రయాణం చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *