సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఈఏడాది జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)లో 28 శాతం పెంచింది. ఆ తర్వాత ఆ డీఏ నుంచి 28శాతం నుంచి 31శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బేసిక్ పే, గ్రేడ్ ప్రకారం వారి జీతం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు, డీఏ పెరిగిన తరువాత జీతం పెరగాల్సి ఉంటుంది. ఇక కేంద్రం నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల మంది పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 7వ పే కమిషన్ సిఫార్సు ప్రకారం, లెవెల్ 1 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం రూ. 18000 నుండి రూ. 56900 వరకు ఉంటుంది. రూ. 18000 జీతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి వార్షిక జీతం రూ. 30,240 పెరుగుతుంది.
