సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2023 సంవత్సరానికి సంబంధించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను నేడు, శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ అవార్డు జ్యూరీ కమిటీ శుక్రవారం కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నివేదికను అందజేసింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఈ సారి జాతీయ ఉత్తమ చిత్రంగా కన్నడ బాషా కు చెందిన సన్ ఫ్లవర్ ఎంపిక కాగా, తెలుగు కు 3 అవార్డ్స్ లభించాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కాగా, ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ – హనుమాన్(తెలుగు)మరియు ఊరూ సినిమా నుండి .. పల్లెటూరు పాటకు బెస్ట్ లిరిక్స్ అవార్డు కు ఎంపిక చేసారు.
