సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త! స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) 2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో పలు పోస్టుల భర్తీకి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్ష నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14,582 ఖాళీలను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేనుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 4, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు: డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా అర్హులే. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 01, 2025 తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 04 జూలై, 2025గా నిర్ణయించారు. భర్తీ చేసే పోస్టుల హోదాలు.. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, ఇన్‌కమ్ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్) పోస్టులు,అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు,ఇన్‌స్పెక్టర్ పోస్టులు,ఆడిటర్ పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు, తదితర శాఖలకు సంబంధించి ఉంటాయి. ఇక దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.100 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు/ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫీజు చెల్లింపులకు 5 జూలై, 2025 వరకు అవకాశం ఉంటుంది. టైర్-I, టైర్‌-II టెస్ట్‌లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు కు ఆన్ లైన్లో ఉన్న అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *