సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం అధినేత చంద్రబాబు నేడు, బుధవారం కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రధాని మోడీ సారధ్యంలో 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పడు ఐదో ఆర్థిక శక్తిగా భారత్ నిలవడం శుభపరిణామం అని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ, మౌలిక రంగాలను నిలబెట్టేలా కేంద్ర బడ్జెట్ ప్రణాళికలున్నాయని తెలిపారు. అయితే, పోలవరం సహా పలు ప్రాజెక్టులు, రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నరు. దీనికి ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సర్కార్, పార్లమెంట్ లో ఉన్న 31 మంది వైసిపి ఎంపీలు దీనికి బాధ్యత వహించాలని, వారి అసమర్ధత వల్లే రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలు పొందలేకపోతున్నామని దుయ్యబట్టారు. విభజన చట్టం ప్రకారం ఏపీలో 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నా .. వాటిని సాధించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైం దని విమర్శించారు. విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్ అని.. ఈ బడ్జెట్లోనూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో 31 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని .ప్రశ్నించారు.
