సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఏ ఎస్ ఆర్ నగర్ లోని అల్లూరి సీతారామరాజు భవనం లో నేటి సాయంత్రం ఆత్మీయ సన్మాన మహోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ , ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు భీమవరం ఎమెల్య పులపర్తి అంజిబాబు, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు. వీరికి కమిటీ పెద్దలు ఘన సన్మానం చేసి భీమవరం ఉండి ప్రాంత అభివృద్ధి లో వీరి సహకారం మరింత కోరుకొంటున్నామని అన్నారు. ఈ ప్రాంతం నుండి కేంద్ర మంత్రిగా స్తానం సంపాదించిన స్థానిక ఎంపీ శ్రీనివాస్ వర్మ కేంద్ర ప్రభుత్వం నుండి తన వంతు సహకారం, నిధులు ఈ ప్రాంతాలకు అభివృద్ధికి అందిస్తానని ఢిల్లీలోనే కాదు భీమవరంలోని తన కార్యాలయంలో కూడా అందరికి అందుబాటులో ఉంటానని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *