సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మ క గ్లోబల్ ఇన్వె స్టర్స్ సమ్మి ట్-2023 కార్య క్రమాలు రెండో రోజు కూడా ఘనంగా జరుగుతున్నాయి.దేశంలో ఏ రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో పారిశ్రామిక వేత్తలు ఏపీలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టానికి ముందుకు వస్తున్నట్లు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొంటున్నారు. 2వ రోజు నేటి శనివారం గ్లోబల్ ఇన్వె స్టర్స్ సమ్మిట్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. విశాఖ రాజధాని.. అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక సందర్భములో వ్యాఖ్యానించారు. అయన మాటలలో.. విశాఖపట్నం రాజధాని, జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ లాంటి వ్యక్తి ఉన్నట్టయితే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. సెమినార్ లో ప్రసంగిస్తూ .. జగన్ సర్కార్ చేస్తున్న కృషి ప్రసంశనీయం అని, ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తోన్న సీఎం జగన్ కు అభినందనలు అన్నారు. ఎంతో విశాల దృక్పధంతో పారిశ్రామిక వేత్తలకు సహకరిస్తున్న నేపథ్యంలో ఏపీ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్రం లోని మోడీ సర్కార్ ఏపీ కి పరిపూర్ణంగా సహకరిస్తుందని. జీఐఎస్లో పాల్గొనడం సంతోషకరం గా ఉంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతం. ప్రతిభగల యువత ఏపీలో ఉన్నారు. 2025 నాటికి ఇండియాలో 250 యూనికార్న్ సంస్థలు ఉంటాయి.రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణసహకారం అందిస్తోంది ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగాఉన్నాయి. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఏపీలో ఎం వోయూలు జరిగాయి. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు అభినందనలు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *