సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి రాజకీయాలకు అతీతంగా ఆత్మీయుడు , కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఢిల్లీలోని తన నివాసం లో గత ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురిఅయ్యారు. కిషన్ రెడ్డి కి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి 10:50 గంటల సమయంలో తరలించారు. అయితే టెస్ట్ లు పూర్తీ అయ్యాక కేంద్రమంత్రికి ఛాతిలో నొప్పి రావడానికి కారణం గ్యాస్ సమస్య అని వైద్యులు తేల్చారు. కార్డియో న్యూరో సెంటర్‌లోని కార్డియాక్ కేర్ యూనిట్‌లో వైద్యులు కిషన్‌రెడ్డికి చికిత్సను కొనసాగిస్తున్నారు. నేడు సోమవారం టెస్టుల తదుపరి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.
