సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నర్సాపురం లోక్ సభ సభ్యులు, రఘురామ కృష్ణంరాజు కేంద్రం నుంచి నర్సాపురం పార్లమెంట్ పరిధిలో 12 ముఖ్యమైన ప్రాజెక్టులను మంజూరు చెయ్యాలని నేడు, గురువారం జాతీయ కేంద్ర రహదారుల మరియు రవాణా శాఖ మంత్రి , నితిన్ గడ్కరీ కలసి విన్నతి పత్రం ఇచ్చారు. వినతి పత్రంలో కీలకమైన 4 అంశాలు : 1) ఉండి నియోజకవర్గంలోని కలవపూడి వయా ఐ-భీమవరం మీదుగా గణపవరం వరకు 40 కోట్ల రూపాయలతో స్టేట్ హైవే ప్రాజెక్టు.2) భీమవరం నుండి ముదినేపల్లి వయా జువ్వలపాలెం ఫోర్ లైన్స్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు.3).ఆకివీడు ఉండి రోడ్ లోని నిర్మాణంలో ఆగిపోయిన ఫ్లైఓవర్ త్వరగా ప్రారంభించాలని కోరడం జరిగింది. 4). ఉండి దిగమర్రు గ్రీన్ ఫీల్ హై వే కోర్టు సమస్యను పరిష్కరించి త్వరగా పనులు ప్రారంభం చెయ్యాలని కోరటం,దానికి గట్కారీ సానుకూలంగా స్వాందించడం జరిగింది.ఎంపీ రఘురామా కృషి ఫలించి ఈ ప్రాజెక్ట్స్ , అభివృద్ధి పనులు శరవేగంగా ప్రారంభం అయితే నిజంగా భీమవరం పరిసర ప్రాంతాలలో రోడ్డు మార్గాల అభివృద్ధి చెంది తద్వారా ఆర్ధిక అభివృద్ధి దూకుడు మాములుగా ఉండదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *