సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర క్యాబినెట్ లో ఉక్కు భారీ పరిశ్రమలు సహాయ మంత్రి పదవి దక్కడంతో పార్టీ కేడర్ సంబరాల్లో మునిగితేలుతోంది. ఆయనకు భీమవరంలో ఘన స్వాగతం పలకడానికి అన్ని వర్గాల ప్రజలు ఎదురు చుస్తునారు. గతంలో జిల్లాలో కేంద్ర మంత్రి వర్గంలో చోటు సాధించిన ఘనులను పరిశీలిస్తే..భీమవరం జేపీ రోడ్డులో కుటుంబ సమేతముగా నివాసం, బీజేపీ కార్యాలయం నిర్వహించిన మాజీ ఎంపీ రెబల్ స్టార్ కృష్ణంరాజు కు తొలిసారి 1999లో కేంద్ర మంత్రి పదవి లభించింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గోకరాజు గంగరాజు ఎన్నికైనా ఆయనకు మంత్రి పదవి వరించలేదు. ఇక ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా పరంగా చుస్తే.. రాజ్యసభకు ఎంపికైన దాసరి నారాయణరావు యూపీఏ ప్రభుత్వంలో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు. అలాగే చిరంజీవి సైతం ప్రజా రాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసాక రాజ్యసభకు ఎంపికై కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఇలా అతికొద్ది మందికి మాత్రమే కేంద్ర మంత్రి మండలిలో సేవలందించారు. తాజాగా.. భీమవరం 3 టౌన్ నరసయ్య అగ్రహారం కు చెందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు. ఆయన మంచి కార్యదీక్ష పరుడు కావడంతో కేంద్ర పెద్దలతో సుదీర్ఘ అనుబంధాలకు తోడు మంత్రి కూడా కావడంతో పెండింగ్ ప్రాజెక్ట్‌లన్నింటికీ కేంద్రం నుంచి నిధులు తెచ్చి పూర్తి చేస్తామని ఎన్నికల్లో వర్మ హామీ ఇచ్చారు.మంత్రిగారి రాకతో జిల్లాలో బీజేపీ పార్టీ పూర్తీ బలోపేతం దిశగా అడుగులు వేయనుంది. ఎందరో కీలక నేతలు, వ్యాపార ప్రముఖులు ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది.
