సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదారాబాద్ లో ప్రైవేటు ఆసుపత్రిలో నేడు, గురువారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు కలరు. వీరు సాంఘిక సంక్షేమ శాఖలో జిల్లా అధికారిగా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి తండ్రి భూపతిరాజు బాపిరాజు గారు స్వతంత్ర ఉద్యమంలో జైలు జీవితం కూడా గడిపారు. కీ.శే.భూపతిరాజు సూర్యనారాయణ రాజు భౌతిక కాయం రేపు ఉదయం భీమవరంలో వారి స్వగృహం నందు దర్శనార్థం ఉంచి, మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్రిమ యాత్రగా భీమవరం టూ టౌన్ లో బలుసుమూడి మోక్షధానం లో అంత్యక్రియలు నిర్వహించుతారని కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *