సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కు జన్మదినం నేపథ్యంలో ఆయన స్వస్థలం భీమవరం లో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన శ్రేయోభిలాషులు, బీజేపీ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా 3న్నర దశాబ్దాలుగా నిబద్దతతో బీజేపీ పార్టీకి అంకితమైన మా మిత్రులు, శ్రీనివాస్ వర్మ గారికి మన సిగ్మా న్యూస్’ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయనతో మా అనుబంధం 25 వసంతాలు నడిచిన సిగ్మా కేబుల్ ఛానెల్స్ తో పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది. మన సిగ్మా కుటుంబ కార్యక్రమాలలో కూడా ఆత్మీయుడుగా హాజరు అయ్యేవారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధికమంది online లో తాజా తాజా సమాచారం వీక్షిస్తున్న మన ‘సిగ్మా తెలుగు డాట్ ఇన్’.. న్యూస్ కూడా ఆయన శుభాబినందనలతో ప్రారంభం కావడం విశేషం.. 2016 సంవత్సరం జూన్ 22 వ తేదీన భీమవరంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సమావేశం వేదికపై మాజీ కేంద్ర మంత్రి, స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు చూస్తుండగా అప్పటి మంత్రి స్వర్గీయ మాణిక్యాలరావు పురంధరేశ్వరి, ఎంపీ గంగరాజు చేతుల మీదుగా మన మిత్రులు , ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా sigmatelugu.in ‘పోస్టర్ ను వెబ్ సైట్ న్యూస్ ప్రారంభం కావడం గమనార్హం. శ్రీనివాస్ వర్మ ఇలాగె ప్రజలు మనిషిగా మరింత ఉన్నత పదవులలో ప్రజా సేవలో తరించాలని కోరుకొంటూ.. స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలతో మీ .. సిగ్మా ప్రసాద్.
