సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు (91) ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ స్వర్గస్తులు అయిన నేపథ్యంలో భీమవరం నరసయ్య ఆగ్రహం లోని శ్రీనివాస వర్మ నివాసం వద్ద గత 6 రోజులుగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు ప్రముఖులతో పాటు స్థానిక శ్రేయోభిలాషులు ఆయన నివాసానికి చేరుకొని వారి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియ జేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు, బుధవారం ఉదయం మన సిగ్మా న్యూస్ తరపున( ప్రసాద్) 35 ఏళ్ళ అవిశ్రాంత బీజేపీ యోధుడిగా, ప్రజా సేవలతో తరించి, కేంద్ర మంత్రి పదవి అందుకున్న శ్రీనివాస వర్మ లాంటి పుత్రుడి యోగాన్ని చుసిన , అందరికి ఆదర్శవంతమైన నిండు జీవితం గడిపిన ‘ధన్య జీవి’ కీ.శే.భూపతిరాజు సూర్యనారాయణ రాజు చిత్ర పటానికి పుష్పాలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. శ్రీనివాస్ వర్మ కుటుంబానికి సంతాపాన్ని తెలపడం జరిగింది.
