సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై కేబుల్ వైరు లేకుండా ఇంటర్నెట్ మరియు టివి ఛానల్స్ , ఓటిటి తో సహా ఎన్నో యాప్ లను అందించే జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్ లు నేడు, మంగళవారం తాజగా..శ్రీ వినాయక చవితి పండుగ నేపథ్యంలో.. దేశంలో 8నగరాలలో ప్రారంభించింది. ప్రస్తుతానికి హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై , ఢిల్లీ , కలకత్తా , ముం బయి, పుణె నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.త్వరలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించే కార్యాచరణ చేస్తుంది. మరి దీని ప్రభావం దేశంలోని ప్రస్తుతం ఉన్న ఇంటర్ నెట్ ప్రొవైడర్స్, కేబుల్ ఆపరేటర్స్ ఫై తీవ్రంగా ఉంటుంది. అయితే టెక్నాలజీ ముందజలో కాలానుగుణంగా మార్పులు సహజమే కదా! దీని విశిష్టతలు ఏమిటంటే.. రూటర్ వాడుతున్న తరహాలో జియో ఎయిర్ ఫైబర్ ఒక వైర్ లెస్ సర్వీ స్ ద్వారా ఇంట్లో ఎన్ని డివైజ్లర్ లనైనా వైఫై ద్వా రా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు .డివైజ్ను ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా దగ్గర్లోని టవర్ నుంచి సిగ్నల్స్ అందుకొని అత్యంత వేగంగా ఇంటర్నెట్ అందిస్తుం ది. ఇక ఇంటర్ నెట్ తో సహా ప్యాకేజి రేట్ల విషయానికివస్తే.. ముందుగా ఇన్స్టలేషన్ ఛార్జీల కింద రూ.1,000 చెల్లించాలి . 12 నెలల ప్లాన్ తీసుకున్న వారికి ఇన్స్టలేషన్ ఛార్జీ అవసరం లేదు. రూ.599- 30Mbps, డిస్నీ + HOT STAR, సోనీ లైవ్ , జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదితర ఓటీటీలు లభిస్తాయి.రూ.899- 100Mbps, డిస్నీ + HOT STAR, సోనీ లైవ్ , జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ తదితర ఓటీటీలు లభిస్తాయి.రూ.1199- 100Mbps, నెట్ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్స్టార్, సోనీLIVE, జీ5, జియో సినిమా తదితర ఓటీటీలు లభిస్తాయి.
