సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే కేరళం సమగ్ర అభివృద్ధి సాధ్యం అని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చాలకుడి పార్లమెంట్ ప్రవాసీ ప్రభారి గా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పెరుంబావూర్, పరవూర్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్డీఏ (NDA) ఎన్నికల కార్యాలయాలను నేడు గురువారం ప్రారంభించారు.వర్మ మాట్లాడుతూ..కొన్ని దశాబ్దాలుగా కేరళలో ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) అరాచక పాలనలో బీజేపీ కార్యకర్తలు ఎన్నో హింసలను భరించారు అని ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలతోపాటు కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పరవూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా గోడపై ‘కమలం’ గుర్తును చిత్రించి ప్రచారాన్ని ప్రారంభించారు.
