సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శబరిమల యాత్రకు వెళ్లిన ఏలూరు మండలం కు చెందిన అయ్యప్ప స్వాముల బస్సు కు తాజగా నేడు, శనివారం జరిగిన ప్రమాద ఘటనపై వెంటనే స్వాందించిన ఏపీ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సీఎంఓ అధికారుల నుం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన మాదేపల్లికి చెందిన భక్తులు శబరిమల యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా కేరళలోని పతనం థిట్ట వద్ద ఘాటు రోడ్డువద్ద ప్రమాదానికి గురైనట్లు అధికారులు సీఎంకు వివరించారు.మొత్తం 84 మంది భక్తులు రెండు ప్రవేటు బస్సుల్లో శబరిమల వెళ్లారని ఇవాళ ఉదయం 8గంటలకు ఒక బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారని అయితే వారిలో 18మందికి గాయాలు అయ్యాయని.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారని వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని కొట్టాయం వైద్య కళాశాల ఆస్ప త్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు వివరించారు. మిగిలిన యాత్రికులకు వసతి, భోజనం ఏర్పా ట్లు చేస్తున్నామని.. పతనం థిట్ట అధికారులతో ఎప్పటికప్పు డు సమీక్షిస్తూ గాయపడినవారికి వైద్యం తోపాటు సరైన సహాయం అందేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *