సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేరళ రాష్ట్రంలో వయనాడ్ (Wayanad)లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య అధికారికంగా 94కు చేరింది. నిజానికి అనధికార లెక్కల ప్రకారం 100 కి పైగా ఉంటుందని భావిస్తున్నారు.ఈ దుర్ఘటన ఫై దేశం యావత్తు దిగ్బ్రాంతి చెందింది. కేరళ నుండి ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్మీతో సహా ప్రకృతి వైపరీత్యాల బృందాలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం, బుధవారం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
