సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ లో మెటా ఆద్వర్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో గత ఏడాది డిసెంబర్ 1వతేదీ నుంచి డిసెంబర్ 31వతేదీ వరకు కేవలం నెలరోజుల్లో 36,77,000 వాట్పాప్ ఖాతాలను నిషేధిస్తూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం విధించింది. ఇందులో 13,89,000వాట్సాప్ వినియోగదారుల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది.ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ పరిశ్రమలోనే అగ్రగామిగా ఉందని వాట్సాప్ ప్రతినిధి చెప్పారు. వాట్పాప్ కు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా వినియోగదారులున్నారు.
