సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తాను సంక్రాంతి పండుగ రోజులలో గుడివాడలో కేసినో తరహా జూదశాల నిర్వహించానని టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు వ్యాఖ్యలకు సంబంధించి నేడు, శుక్రవారం గుడివాడలో తన కె కన్వెన్షన్ సెంటర్‌లో మంత్రి కొడాలి నాని ప్రతిపక్షనేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశాలలో అవినీతి డబ్బు దాచుకొనే చంద్రబాబుకు, లోకేష్‌కు కేసినో అంటే బాగా తెలుసని అన్నారు. తన కల్యాణ మండపంలో కేసినో పెట్టానని నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. ఇక్కడే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో జరిగిన దృశ్యాలు తీసుకువచ్చి తన కన్వెన్షన్‌లో జరిగినట్టుగా చూపిస్తున్నారని మండిపడ్డారు..దీనిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వెయ్యడమేమిటని? వాళ్ళు అక్కడకు వెళ్లి తప్పులు నిర్ధారించడమేమిటని ప్రశ్నించారు. అక్కడ పోలీసులు ఉండబట్టే వాళ్లు బతికి బయటకొచ్చారని లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉండేవని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
