సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాడు టీడీపీ లో కీలక నేత, ప్రస్తుత వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. తాజగా వల్లభనేని వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఇది కూటమి సర్కార్ కుట్ర అని పేర్కొన్నారు. వంశీ ఫై కేసు పెట్టినవారు కేసు ను వెనక్కు తీసుకుంటే మళ్ళీ ఈ అరెస్టు చేయడం ఏంటని? ప్రశ్నించారు. కక్ష పూరిత రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. విశాఖలో ఋషికొండ భవనాలు ప్రభుత్వ కట్టడాలు అవి ప్రభుత్వ ఆస్తులు వాటిని చక్కగా వినియోగించుకోవాలని అన్నారు. వాటి నిర్మాణాలలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయని ప్రజలు కష్టాలు పడుతున్నారని శాసనమండలి లో వైసీపీ తరపున ప్రశ్నిస్తామని, నిలదీస్తామని బొత్స అన్నారు. ఇదిలా ఉండగా కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో డీఎస్పీ రాజా పేర్ని నాని ఇంటికి వెళ్లారు.పేర్ని నాని హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు నాని ఇంటికి భారీగా చేరుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *