సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:కైకలూరు లో ప్రముఖ ఆక్వా రైతు ఐబీకేవీ ప్రసాదరాజు (వజ్రం రాజు) ను గత నెల రోజులుగా రెండు నంబర్ల నుంచి ‘కామ్రేడ్స్ మాట్లాడుతున్నాం .. మాకు రూ.2 కోట్లు ఇవ్వకపోతే నీతో పాటు నీ కొడుకును కూడా చంపేస్తాం’ అంటూ పలుమారులు ఫోన్లు రావడంతో ప్రసాదరాజు ఈ నెల 18న కైకలూరు టౌన్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు, బాధితునికి వచ్చిన ఫోన్ కాల్స్ ట్రేసింగ్ ఆధారం గా 4గురు నిందితులను కారు డ్రైవర్ల ముఠా గా గుర్తించి వారిలో ముగ్గరు నిందితులను అరెస్ట్ చేసారు, ఇంకా కీలక నిందితుడు మాణిక్య రావును పట్టుకోవాల్సి ఉంది. కైకలూరు టౌన్ స్టేషన్లో సీఐ ఆకుల రఘు, ఎస్ఐ జ్యో తిబసు నిందితుల వివరాలు తెలియజేస్తూ,.. మండవల్లి మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తోకల ఏసేబు (36), చిన్నం బారం బాసు (51),హైదరాబాదు, ఏజీ కాలనీ, ఎర్రగడ్డకు చెందిన శీలం హేమంత్కుమార్ (33), హైదరాబాదు, హిమాయత్ నగర్ కు చెందిన దారా మాణిక్యరావు (44)గా వారిని గుర్తించారు.వీరిలో ఏసేబు, మాణిక్య రావు కైకలూరులో ప్రసాదరాజు దగ్గర గతం లో కారు డ్రైవర్లుగా పనిచేశారు. ఆ అనుభవంతో అతనిని బ్లాక్ మెయిలింగ్ చేసి త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ తో మాణిక్యరావు హైదరాబాదులోని తన స్నేహితుడు, మరో కారు డ్రైవర్ హేమంత్ కుమార్ తో రెండు సిమ్ కార్డులు కొనుగోలు చేయించాడు. హైదరాబాదు శివారు రింగురోడ్డు నుంచి ఫోన్లు చేసి ప్రసాదరాజును డబ్బు కోసం బెదిరించారు. నిందితుల్లో ఏసేబు, బారంబాసు, హేమంత్కుమార్ ని అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *