సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైలులో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం తరలిస్తున్న ముగ్గురు మహిళల ముఠాను ఫై అందిన సమాచారం మేరకు కైకలూరు టౌన్ సీఐ రఘు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా విదేశీ, స్వదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేడు, బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ముంబై నుంచి విశాఖపట్నం వెళ్లే ఎల్టీటీ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు చీరాల వాడరేవుకు చెందిన వారుగా గుర్తించారు. 35 నుంచి 45 సంవత్సరాలు వయసు కలిగిన నిందితులయిన మహిళలు మొత్తం 24 బ్యాగుల్లో లక్షలాది రూపాయలతో గోవాలో కొనుగోలు చేసిన వందలాది మద్యం బాటిల్స్ ను తరలిస్తూ పోలీసులకు చిక్కారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *