సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు, శనివారం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని పవిత్ర కొండగట్టు క్షేత్రం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పవన్ కల్యాణ్ కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనం అందించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గన వెళ్లారు.. మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకున్న పవన్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల సమయంలో వారాహి విజయ యాత్రకు ముందు వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు కట్టిన విషయం విదితమే. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం మరల నేడు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ ను చూడటానికి వచ్చిన విశేష ప్రజానీకానికి అభిమానులకు పవన్ అభివాదాలు చేసారు.
