సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్ర లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా అధికంగా జరుగుతుంది, రాయగడ్ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్వాడీలో మొన్న బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు ఇప్పటికి కొనసాగుతున్నా యి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. గ్రామం లో 229 మంది జనాభా ఉండగా వీరిలో 22 మంది మృతిచెందగా మరో 10మంది గాయపడ్డారు. ఇం కో 111 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా 86 మంది ఆచూకీ తెలియరాలేదు. ఇక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులు నదులను తలపించాయి. ముంబయిలో 100కి పైగా లోకల్ రైళ్లు రద్దయ్యాయి. అటు ముంబయికి వాతావరణ శాఖ ఆరెంజ్అలర్ట్ జారీ చేసింది.
