సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైఎస్సార్ జిల్లాలో నేడు, సోమవారం కొండాపురం మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిం ది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా..ఐదుగురు తీవ్రం గా గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రి, మరియు కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి తుఫాన్ వాహనంలో వెళ్లారు. దర్శనం చేసుకొని తిరిగి అదే వాహనం లో స్వ గ్రామాలకు బయలుదేరారు. మార్గం మధ్యలో కడప -తాడిపత్రి ప్రధాన రహదారిలో ఏటూరు గ్రామానికి సమీపంలో వీరందరూ ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఏడుగురు అక్కడిక్క డే మృతి చెందారు. మరో ఐదురుగు తీవ్రంగా గాయపడ్డారు. వారిని గమనించిన స్థానికులు 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
