సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల కేటీఆర్ ఫై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆయనకు సినిమా పరిశ్రమ వారికీ మధ్య లింకులు.. అంటూ పలు ఆరోపణలు చెయ్యడం..పెద్ద రచ్చ జరగడం తెలిసిందే.. దానికి సినీ పరిశ్రమ లోని కొందరు మినహా హీరోలు జూ ఎన్టీఆర్, నాని,చిరంజీవి. వెంకటేష్ ప్రభాస్ వంటివారు అక్కినేని నాగార్జునకు , సమంత, రకుల్ కు అండగా సంఘీభావం ప్రకటించి,.విమర్శించిన నేపథ్యంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నట్లు ప్రకటించారు.అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వివాదాన్ని ఇంతటితో ముగించాలని సినీ పెద్దలకు పిలుపు నిచ్చారు. అయితే ఆమె ఫై తాజగా అక్కి నేని నాగార్జున క్రిమినల్ అండ్ పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో కారణం ఏదయినా.. అక్కినేని నాగార్జునకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తమ్మిడికుంట కబ్జా చేసి Nకన్వె న్షన్‌ నిర్మించడంపై సినీ హీరో అక్కి నేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ‘జనం కోసం ’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేసారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు లీగల్‌ ఒపీనియన్‌కు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *