సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం జగన్ గత సోమవారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గడప గడపకు, గృహసారథుల నియామకాలపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 18 తర్వాత రెండు నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గడప గడపకు.. కార్యక్రమంలో కొందరు మంత్రులుతో సహా 20 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని సమావేశంలో ప్రకటించారు.. ఆయన చదివిన పేర్లలో.. మాజీ మంత్రి కొడాలి నాని, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఉండటం అందరిని కొంత షాక్ కు గురిచేసింది. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని.. ఏది తేలికగా తీసుకోవద్దని ఇంకా కష్టపడాలని, వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలూ గెలిచే దిశగా వైసీపీ ఎమ్మెల్యేలందరూ రెండు నెలల పాటు ప్రజల్లోనే తిరగాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 18, 19 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని వీటిలో ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలి అని ఆదేశించారు.
