సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన జనసేన పార్టీ నేత, కొణిదల నాగేంద్ర రావు సతీ సమేతంగా మండలి చైర్మన్ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. ప్రజా రాజ్యం పార్టీ నుండి రెండు దశాబ్దాల రాజకీయాలలో ఉన్న నాగబాబు కు తొలిసారి చట్ట సభలలో ప్రజా ప్రతినిధిగా పదవి లభించింది. అలాగే బీజేపీ నేత సోము వీర్రాజు కూడా నేడు, బుధవారం ఏపీ శాసనమండలి చైర్మన్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ ఇద్దరు నేతలును మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఎమ్మెల్సీలు గా ప్రమాణ స్వీకారం చేయించి, మండలికి సంబధిత కిట్స్ అందించారు.. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 2వ సారి ఎమ్మెల్సీ గా ఎన్నికయిన సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలు ఆయనను గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి, ఇతర నాయకులు శాలువా, పూలదండలతో సోము వీర్రాజును సత్కరించారు. ఏపీలో బీజేపీకి మంచి రోజులు వచ్చాయని, ప్రభుత్వంలో కింద స్థాయిలో జరిగే లోపాలను ప్రభుత్వం దృష్టికి బీజేపీ తీసుకెళుతుందన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *