సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన విషాదం తో పాటు అందరిని షాకింగ్ కు గురిచేసింది. అసలు గుట్టు బయటకు తెలియలేదు కానీ.. పెళ్లై ఐదు రోజులైనా కాలేదు. నవ దంపతులు సిద్ధాంతం వంతెనపై నుండి గోదావరిలోకి దూకారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే వధువు గల్లంతవ్వగా.. వరుడు మాత్రం ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. దీనిపై వధువు కుటుంబ సభ్యులు వరుడు చెప్పిన కధనం ఫై సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సమాచారం ప్రకారం.. ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన వరుడు కె.శివరామకృష్ణతో వడలికి చెందిన కోరాడ సత్యవాణి¨(19)కి ఈ డిసెంబరు నెల 16న వివాహమైంది. మొన్న మంగళవారం రాత్రి వడలి నుంచి వీరిద్దరూ సినిమాకి బైక్ ఫై రావులపాలెం వెళ్లారు. సినిమా చూసి తిరిగి వస్తూ తర్వాత ఏమైందో.. వరుడు వధువు గోదావరిలో దూకారు…వారి అరుపులకు స్థానిక మత్యకారుల సహాయంతో ఒడ్డుకు ఈదుకొచ్చిన వరుడు… వధువు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. పోలీసుల సాయంతో గత బుధవారం గాలింపు చర్యలులో వధువు మృత దేహం లభ్యమైంది.. వరుడు శివరామకృష్ణను తణుకులోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి ఆరోగ్య పరీక్షలు జరిపి తీసుకురాగా, వధువు బంధువుల ఆందోళనకు దిగటంతో వరుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పెనుగొండ ఎస్సై రమేష్ తెలిపారు.
