సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారుల బదిలీలు విశేషంగా జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం భీమవరంలో కూడా పలువురు కీలక అధికారుల బదిలీలు జరిగాయి. కొత్త అధికారులు వచ్చి ఛార్జ్ తీసుకొంటున్నారు. దీనిలో భాగంగా నేడు, శుక్రవారం భీమవరం తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన శివశంకర్, మరియు ఎక్ససైజ్ (మద్యం శాఖ) సి ఐ గా బాధ్యతలు స్వీకరించిన కల్యాణ చక్రవర్తి, మరియు భీమవరం టూటౌన్ ఎస్ఐగా‌ బాధ్యతలు చేపట్టిన రమేష్ లు శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతతో ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని, ప్రజలతో గౌరవం తో ప్రవర్తించాలని, అధికారులుగా చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని వారికీ అభినందనలుతెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *