సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం వైఎస్ జగన్ నేడు, శుక్రవారం విజయనగరం జిల్లాలో .పర్యాటనలో భాగంగా విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి అనంతరం .. వర్చువల్ విధానంలో మరో 4 మెడికల్ కళాశాలలను రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వైద్య విద్యకు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చేపట్టిందని దానిలో భాగంగానే ఈ రోజు 5 కాలేజీలు ప్రారంభించామని.. మన పిల్లలు కోసం దూరప్రాంతాలలో కాకుండా ఇక్కడే వైద్య విద్య అందాలన్న లక్ష్యంతో ఈ యజ్ఞం ప్రారంభించి పూర్తీ చేస్తున్నామని, ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా మీ జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్నమని సీఎం జగన్ ప్రకటించారు.
