సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్న వేళా జగన్ సర్కార్ నిరుద్యోగులకు వేలాదిగా కొత్త కొలువులకు ఆహ్వానం పలుకుతుంది. సీఎం, వైఎస్ జగన్, అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నేడు, బుధవారం మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో కొత్తగా 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ఆమోదం తెలిపింది. ఇంకా పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. వైఎస్సార్ చేయూత 4వ విడతకు ఆమోదంతో ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేద్దామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం లభించింది. ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం తెలిపారు. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లోపనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచాలని ఆమోదించారు. ఇంకా అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం లభించింది. నంద్యా ల, కర్నూలు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో విండ్ పవర్ ప్రాజెక్ట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది.
