సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం మండలం కొత్తపూసమర్రు గ్రామంలో నేడు శుక్రవారం సుమారు రూ 70 లక్షల రోడ్డు పనులకు ఎమ్మెల్యే అంజిబాబు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. భీమవరం నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని కొత్తపూసమర్రు నుంచి తోకతిప్ప వరకు 700 మీటర్లతోపాటు మరో 1.8 కిలో మీటర్ రోడ్డు పనులు సుమారు రూ 70 లక్షలతో జరుగుతాయని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుందని, ప్రతి గ్రామంలో సుమారు రూ 5 నుంచి 10 లక్షలతో సిసి రోడ్లను కూడా వేయిస్తామని అన్నారు. అన్ని గ్రామాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *