సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ యుద్ధాలతో ఇటీవల వరుస నష్టాలతో కుదేలు అయిన స్టాక్ మార్కెట్.. నేడు, కాస్త ఊపిరి తీసుకొంది .కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఏప్రిల్ 1 నేడు, బుధవారం ఈ ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే నిఫ్టీ ఏకంగా 22,899.00 వద్దకు చేరింది. (నిన్నటి సెలవు రోజు కావడంతో) గత ముగింపు (22,331.40) నుంచి చూస్తే ఇది చాలా పెద్ద జంప్. ఉదయం 9:15 గంటల సమయానికి నిఫ్టీ 507.80 పాయింట్లు (+2.27%) లాభపడి 22,839.20 వద్ద ట్రేడ్ అవుతోంది.సెన్సెక్స్ 73,762.43 వద్ద ఓపెన్ అయ్యి, ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1,695.88 పాయింట్ల (+2.36%) భారీ లాభంతో 73,643.42 వద్ద కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సెన్సెక్స్ సూచీ 73,847.08 స్థాయిని తాకింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎనర్జీ రంగాల షేర్లు భారీ కొనుగోళ్లతో ఉపందుకొన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *